శుక్రవారం 05 మార్చి 2021
Andhrapradesh-news - Jan 21, 2021 , 19:12:26

కృష్ణంరాజును చిన్న పిల్లాడిలా రెడీ చేస్తున్న ప్రభాస్..వీడియో

కృష్ణంరాజును చిన్న పిల్లాడిలా రెడీ చేస్తున్న ప్రభాస్..వీడియో

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది తండ్రీ కొడుకులు స్నేహితుల మాదిరే ఉంటారు. అందులో నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు తమ వారసులతో ఎప్పుడూ సరదాగా గడిపేస్తుంటారు. వాళ్ళతో స్ట్రిక్ట్ ఫాదర్స్‌లా కాకుండా స్నేహితుల్లా కలిసిపోతుంటారు. అలాంటి మరో తండ్రీ కొడుకు కృష్ణంరాజు, ప్రభాస్. నిజానికి ప్రభాస్ ఈయనకు సొంత కొడుకు కాదు..తమ్ముడు సూర్యనారాయణ రాజు కొడుకు. తనకు వారసులు లేకపోవడంతో ప్రభాస్ నే వారసుడిగా పరిచయం చేసాడు ఈయన. మరోవైపు ప్రభాస్ కూడా పెదనాన్నలా ఎప్పుడూ చూడడు.. ఆయన తండ్రి లాగానే చూస్తుంటాడు. తండ్రి సూర్యనారాయణ రాజు చనిపోయిన తర్వాత ప్రభాస్, కృష్ణంరాజు మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది. పెదనాన్నతో చిన్నపిల్లాడిలా ఆడుకుంటాడు ప్రభాస్. 

బయటి వాళ్లకు రాజుగారిని చూస్తుంటే భయమేస్తుందేమో కానీ ఇంట్లో ఉంటే మాత్రం చిన్నపిల్లోడు అయిపోతాడు. ఆయన భార్య కూడా ఇదే మాట చెప్తుంది. కృష్ణంరాజులో మీకెవ్వరికి తెలియని చిన్న పిల్లాడు ఉంటాడు అని. జనవరి 20న ఈయన తన 81వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ప్రభాస్ కూడా ఇంట్లోనే ఉండి పెదనాన్నతో గడిపాడు. ఆయనొక్కడే కాదు ఇంట్లో ప్రతీ ఒక్కరు రాజు పుట్టిన రోజును గ్రాండ్ గా జరిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో మాత్రం అభిమానులకు బాగా నచ్చేసింది. అదే ప్రభాస్ తన పెదనాన్నను రెడీ చేస్తున్న వీడియో. అందులో కృష్ణంరాజు అలా నిలబడి ఉంటే ముందు నుంచి ప్రభాస్ తన తండ్రిని అందంగా ముస్తాబు చేస్తున్నాడు. 


హెయిర్ స్టైల్ సెట్ చేస్తూ ఉన్న ఈ వీడియోను చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చిన్న పిల్లాడిలా తన పెదనాన్నను ముస్తాబు చేస్తున్న ప్రభాస్ ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే మీ అనుబంధాలు బాగానే ఉన్నాయి కానీ ముందు మా ప్రభాస్ అన్నకు పెళ్లి చేయండి రాజుగారు అంటూ కింద కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. ఇప్పటికే ఈయన వయసు 41 దాటి 42 వైపు పరుగులు తీస్తుంది.. ప్లీజ్ త్వరగా పెళ్లి చేసేయండి సర్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ తండ్రీ కొడుకుల వీడియో మాత్రం ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo