ఆదివారం 24 జనవరి 2021
Andhrapradesh-news - Nov 16, 2020 , 20:19:57

తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక.. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి.!

తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక.. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి.!

అమరావతి : తిరుపతి ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకుడు బల్లి దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీడీపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా నిర్ణయించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులకు తెలిపారు.

సోమవారం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఉప ఎన్నికలో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అభ్యర్థి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు. 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పనబాక లక్ష్మి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆమెనే రంగంలోకి దించితే సెంటిమెంట్‌తో గెలిచే అవకాశముందని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo