మంగళవారం 24 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 25, 2020 , 16:02:08

రేప‌ట్నుంచి శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ

రేప‌ట్నుంచి శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ

తిరుప‌తి : శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి మ‌ళ్లీ టోకెన్ల జారీ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌టించింది. ఈ నెల 26వ తేదీ నుంచి తిరుప‌తి భూదేవి కాంప్లెక్స్‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేయ‌నున్నారు. శ్రీవారి ద‌ర్శ‌నానికి ఒక రోజు ముందు స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేయ‌నున్నారు. రోజుకు 3 వేల స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేయ‌నున్న‌ట్లు టీటీడీ ప్ర‌క‌టించింది. ప్ర‌తి రోజు ఉద‌యం 5 గంట‌ల నుంచి ఈ టోకెన్లు జారీ చేస్తారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు ఉన్న‌వారికే అలిపిరి నుంచి కొండ‌పైకి అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.