ఆదివారం 24 జనవరి 2021
Andhrapradesh-news - Jul 21, 2020 , 06:32:33

శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలిపివేత

శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీ తాత్కాలికంగా నిలిపివేత

తిరుమల : తిరుపతి నగరంలో కంటైన్మెంట్‌ నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఆఫ్‌ లైన్‌లో జారీ చేస్తున్న 3 వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లు మంగళవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి టోకెన్లు జారీ చేసే తేదీని తిరిగి తెలియజేస్తామని టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేసింది.  

తిరుమల దేవస్థానంలో ఇప్పటికే 160 మంది సిబ్బందికి పైగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరో 16 మంది అర్చకులకు కరోనా సోకింది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో టీటీడీ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతోంది. 


logo