మంగళవారం 01 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Jul 24, 2020 , 20:06:36

తిరుమ‌ల‌లో శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

తిరుమ‌ల‌లో శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

తిరుమల: తిరుమలలో శుక్రవారం శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర  జరిగింది. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారి శేషవస్త్ర‌న్ని, శఠారిని పురుశైవారితోటలోని శ్రీ అనంత ఆళ్వార్ కి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారు ప్రబంధ పారాయణం నిర్వహించారు. శ్రీ ఆండాళ్ అమ్మ‌వారు తుల‌సీ వ‌నంలో జ‌న్మించారు, స‌ప్త‌గిరుల‌ను శ్రీ అనంత ఆళ్వార్ నంద‌న‌వ‌నంగా మార్చారు. కావున తిరుమ‌ల‌లో ప్ర‌తి ఏడాది తిరువ‌డిపురం ఉత్స‌వంను పురుశైవారితోటలో నిర్వ‌హించ‌డం అన‌వాయితిగా వ‌స్తుంద‌ని అర్చ‌కులు తెలిపారు. ‌పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ కారణంగా కటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు.