శుక్రవారం 04 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Oct 31, 2020 , 15:44:35

పైవేటు విద్యా సంస్థల ఫీజుల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం

పైవేటు విద్యా సంస్థల ఫీజుల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం

అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం లోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫీజులు తగ్గించుకోవాలని ఆదేశించింది. ట్యూషన్‌ ఫీజులో 30 శాతం మేర తగ్గించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. కరోనా వల్ల పాఠశాలలు, కళాశాలలు తెరవనందున నిర్వహణ భారం తగ్గిందన్న ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు సిలబస్‌ తగ్గించాలని సూచించింది.

రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి డిగ్రీ, పీజీ తరగతులను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. యూనివర్సిటీలు, కళాశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు ఇప్పటికే జారీ చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో వారంలో 6 రోజుల పాటు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. పని దినాల్లో సెలవు ఇవ్వాల్సి వస్తే రెండో శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహించాలని సూచించింది. అలానే తరగతి గదులు, క్యాంటీన్లు, జిమ్, హస్టళ్లలో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు