శనివారం 08 ఆగస్టు 2020
Andhrapradesh-news - Aug 02, 2020 , 13:48:08

టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్‌ సస్పెండ్‌

టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్‌ సస్పెండ్‌

శ్రీకాకుళం:  మహిళా కండక్టర్‌ను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలపై జిల్లాలోని టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఈశ్వరరావును సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ రవికుమార్‌ ఉత్తర్వులు జారీ  చేశారు. డిపో మేనేజర్‌ వేధింపులకు గురి చేస్తున్నారని మహిళా కండక్డర్‌ ఇటీవల ఆర్టీసీ ఉన్నతాధికారులకు లిఖితపూర్వ ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ జరిపారు. విచారణ అధికారుల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా డిపో మేనేజర్‌ను సస్పెండ్‌ చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo