ఆదివారం 07 మార్చి 2021
Andhrapradesh-news - Jan 05, 2021 , 21:41:42

సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి

సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయాల్సిందిగా సీఎంను కోరారు. అనంత‌రం స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. దేవాలయాల భద్రతపై సీఎంతో మాట్లాడా. దాడులపై దర్యాప్తును వేగవంతం చేయాలని కోరాం. స్వరూపానంద స్వామివారు ఇచ్చిన సూచనలను కూడా సీఎంకు నివేదించాం. ప్రైవేటు ఆలయాల కమిటీలను సైతం దేవాదాయశాఖ, పోలీసులు సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించాం. పోలీస్‌ స్టేషన్‌ల వారీగా ఆలయాలపై దృష్టిపెట్టాలని సూచించాం. 

దుశ్చర్యలను తీవ్రంగా పరిగణించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల‌న్నారు. తాను సూచించిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు. ప్రతి సూచనను నోట్‌ చేసుకున్నారన్నారు. దర్యాప్తును వేగవంతం చేస్తామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో విజయవాడలో పడగొట్టిన దేవాలయాల పునర్‌ నిర్మాణానికి ఈ నెల 8న శంకుస్థాపన చేస్తున్నట్టుగా సీఎం తెలిపారు. ఇప్పటికే 30వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా వివరించారు. దేవుడు మనుషులను రక్షించాలి, అలాంటిది దేవుడి ఆలయాలను మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

VIDEOS

logo