శనివారం 16 జనవరి 2021
Andhrapradesh-news - Nov 30, 2020 , 22:54:50

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఏపీ హోంమంత్రి

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఏపీ హోంమంత్రి

అమరావతి : ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని)పై దాడి చేసిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకపాటి సుచరిత పోలీసులను ఆదేశించారు. సోమవారం ఆమె డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో కలిసి మంత్రి పేర్ని నానిని ఆయన నివాసంలో పరామర్శించారు.  దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై  నిష్పక్షపాతం విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. 

దాడి చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తేనని, అతడు ఆ పార్టీ పోలింగ్‌ ఏజెంట్‌ కూడా అని సమాచారం ఉందన్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఉపేక్షించబోదని అన్నారు. విచారణ పూర్తి కాగానే పోలీసులు అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తారని ఆమె చెప్పారు.   కాగా  ఆదివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని తన నివాసంలో తల్లి పెద్దకర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఆయనపై దాడి జరిగింది.  గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడి చేశాడు.  అక్కడే ఉన్న మంత్రి అనుచరులు, పార్టీ నేతలు అతణ్ని అడ్డుకున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.