మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 05, 2020 , 20:57:25

ఆన్‌లైన్‌లో శ్రీవారి కల్యాణోత్సవ సేవ.. రేపటి నుండి టికెట్ల బుకింగ్‌

ఆన్‌లైన్‌లో శ్రీవారి కల్యాణోత్సవ సేవ.. రేపటి నుండి టికెట్ల బుకింగ్‌

తిరుమల : కోవిడ్‌-19 నేపథ్యంలో శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 7వ తేదీ నుండి 31వ తేదీ వరకు కల్యాణోత్సవ టికెట్లను రేపు(గురువారం) ఉదయం 11 గంటల నుండి ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావాల్సిన వారు టీటీడీ వెబ్‌సైట్‌ www.tirupatibalaji.ap.gov.in కు లాగినై వివరాలు పొందుపరిచి గేట్‌వే ద్వారా రూ. 1000 చెల్లించి ఆన్‌లైన్‌ రశీదు పొందవచ్చు. శ్రీవారి ప్రసాదాలను పోస్టల్‌ ద్వారా టీటీడీ ఉచితంగా అందజేస్తుంది. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. అర్చకుల సూచనల మేరకు తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పాలి. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలు ప్రసాదంగా ఇంటికి వస్తాయి.


logo