శనివారం 24 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Aug 20, 2020 , 10:53:25

శ్రీశైలం మరో రెండుగేట్ల ఎత్తివేత.. సాగర్‌కు భారీ వరద

శ్రీశైలం మరో రెండుగేట్ల ఎత్తివేత.. సాగర్‌కు భారీ వరద

హైదరాబాద్‌ : శ్రీశైలం డ్యామ్‌కు ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో అధికారులు ఇప్పటికే మూడు గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా మరో గురువారం ఉదయం మరో రెండు గేట్లను ఎత్తివేసి 1,99,938 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఎగువ నుంచి 4,29,507 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో వస్తుంది. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.30 అడుగుల మేర నీరుంది. కుడి, ఎడమ గట్టుల్లో విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, నారాయణపూర్‌, ఆల్మట్టి, సుంకేశుల జలాశయాల నుంచి భారీగా వరద వస్తోంది. వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్టే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 1,52,674 క్యూసెక్కుల వరద వస్తుండగా, 3,912 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 573.60 అడుగుల మేర నీరుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo