గురువారం 13 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 05, 2020 , 19:28:04

శాకాంభరిగా దర్శనమిచ్చిన శ్రీశైల భ్రామరి

శాకాంభరిగా దర్శనమిచ్చిన శ్రీశైల భ్రామరి

శ్రీశైలం : ఆషాఢ పౌర్ణమి సందర్బంగా ఆదివారం శ్రీశైల భ్రమరాంభికాదేవి అమ్మవారికి శాకంభరి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సుమారు 3,500 కిలోలకు పైగా 40 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి గర్బాలయము, దేవాలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఉత్సవంలో భాగంగా సప్తమాత్రికలకు రాజరాజేశ్వరి అమ్మవారితోపాటు గ్రామ దేవత అంకాళమ్మకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు, అభిషేకాలు చేశారు. శాకాంభరిగా దర్శనమిచ్చే అమ్మవారిని కొలువడంతో కరువుకాటకాలు నివారించబడుతాయని నమ్మకం. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామారావు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సూక్ష్మక్రిమి వ్యాదులు ప్రబలకుండా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మహా సంకల్పాన్ని పఠించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురుపౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి, హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తి, వ్యాసమహర్షికి ప్రత్యేక పూజలు జరిపారు. 

గురుపౌర్ణమిని పురస్కరించుకోని సాక్షి గణపతి ఆలయంలో పంచామృతాభిషేకాలు విశేష పుష్పార్చనలు, సంకటహర నిత్య గణపతి హోమం నిర్వహించారు. సాయంత్రం వేళ వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన పల్లకిలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేసి పల్లకిసేవ చేపట్టారు.


logo