ఆదివారం 29 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 29, 2020 , 21:30:50

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు

శ్రీశైలం : అష్టాదశ శక్తిరం ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్ల హుండిని గురువారం ఉదయం లెక్కించారు. దేవస్థానానికి భక్తులు వచ్చి స్వామివారికి చెల్లించుకున్న ముడుపులు, కానుకల రూపంలో రూ.1,41,20,481 హుండీ ఆదాయం వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీలతో పాటు పరివార దేవాలయాల హుండీలను లెక్కించారు. ఆలయ అధికారులు సిబ్బందితో లెక్కింపు చేపట్టారు. కరోనా వైరస్‌ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడంతో గత 23 రోజులుగా స్వామి అమ్మ వార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలను కట్టుదిట్టమైన భద్రత, నిఘా నేత్రాల పర్యవేక్షణలో లెక్కింపు జరిగినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.