బుధవారం 30 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 12, 2020 , 20:00:33

భ‌క్తుల గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో ద్వార‌క‌ను త‌ల‌పించిన తిరుమ‌ల‌

 భ‌క్తుల గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో ద్వార‌క‌ను త‌ల‌పించిన తిరుమ‌ల‌

తిరుమల : తిరుమలలో బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వ‌ర్యంలో  నిర్వహించారు. గోగర్భం డ్యామ్‌ దగ్గర లోని ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి  ఉదయం 10.00 గంట‌ల నుంచి పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, కుంకుమ‌, చంద‌నం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ  తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదికపై సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో భాగంగా  ఉద‌యం శ్రీకృష్ణ జన్మాష్టమి పారాయ‌ణం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో తిరుమ‌ల గిరులు ద్వార‌క‌ను త‌ల‌పించాయి. తిరుమ‌ల‌లో టిటిడి నిర్వహిస్తున్న పారాయణ‌ కార్య‌క్ర‌మం బుధ‌వారం 125వ రోజుకు చేరుకుంది.

శ్రీకృష్ణ జన్మాష్టమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని వ్యాస‌మ‌హర్షి ర‌చించిన భాగ‌వ‌తంలోని ద‌శ‌మ‌స్కంధం మూడ‌వ ఆధ్యాయంలోని శ్రీ‌కృష్ణుని జ‌ననం పారాయ‌ణం చేశారు. అనంత‌రం తిరుప‌తి ఇస్కాన్ నుంచి వ‌చ్చిన 20 మంది భ‌క్తులు నామ‌సంకీర్త‌న నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, డెప్యూటీ ఈవోలు హ‌రీంద్ర‌నాధ్‌, శ్రీ బాలాజి, ఎస్వీ వేద ఉన్న‌త వేద అధ్యాయ‌న‌ సంస్థ ప్ర‌త్యేకాధికారి విభీష‌ణ శ‌ర్మ తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని పాల్గొన్నారు.


logo