గురువారం 03 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Oct 28, 2020 , 01:28:14

వచ్చేనెల తిరుమలలో విశేష ఉత్సవాలు

వచ్చేనెల తిరుమలలో విశేష ఉత్సవాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వచ్చేనెల తిరుమలలో పలు విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 14న దీపావళి ఆస్థానం, 18న నాగుల చవితి, 20న పుష్పయాగానికి అంకురార్పణ, 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం,  25న స్మార్త ఏకాదశి నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు మంగళవారం వెల్లడించారు. 26న మధ్య ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, చక్రతీర్థ ముక్కోటి, 27న కైశిక  ద్వాదశి ఆస్థానం, 29న కార్తీకదీపం, తిరుమంగై ఆళ్వార్‌ శాత్తుమొర నిర్వహించనున్నారు.