సోమవారం 26 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 19, 2020 , 14:33:10

ఏసీ గదిలో ఓ దొంగ ఏంచేశాడో తెలుసా?

ఏసీ గదిలో ఓ దొంగ ఏంచేశాడో తెలుసా?

రోజంతా క‌ష్ట‌ప‌డి రాత్రి ఇంటికి చేరుకొని ఏసీ గ‌దిలో ప‌డుకుంటే హాయిగా ఉంటుంది. క‌ష్టం అంతా మ‌రిచిపోయి మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆ స‌మ‌యంలో కాసేపు అలానే ప‌డుకోవాల‌నిపిస్తుంది కాని లేవాల‌నిపించ‌దు. పాపం ఈ దొంగ విష‌యంలో కూడా అలానే జ‌రిగింది. దొంగ‌త‌నానికి వ‌చ్చిన అత‌ను ఇల్లంతా దోచుకున్నాడు. చివ‌రిగా ఏసీ గ‌దిలో ఉన్న ప‌వ‌ర్ ఎన్ఏపీని తీసుకొని ఎస్కేప్ అవుదాం అనుకున్నాడు. అక్క‌డే అంతా తారుమారైపోయింది. గ‌దంతా చ‌ల్ల‌గా ఉండటంతో అక్క‌డే నిద్ర‌పోయాడు దొంగ‌. ఈ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లాలో చోటు చేసుకున్న‌ది.

పెట్రోల్‌బంక్ య‌జ‌మాని స‌త్తి వెంట‌ర్ రెడ్డి ఇంటికి 22 ఏండ్ల వ్య‌క్తి దొంగ‌త‌నానికి వెళ్లాడు. మ‌రుస‌టి రోజు ఉద‌యం య‌జ‌మాని ఇంటికి చేరుకునే స‌రికి ఇళ్లంతా గంద‌ర‌గోలంగా ఉంది. దొంగ‌ను చూసిన య‌జ‌మాని గ‌దిని లాక్ చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. త‌ర్వాత త‌లుపు తెరిచి దొంగ‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వీట్‌షాపులో ప‌నిచేస్తాన‌ని దొంగ చెప్పుకొచ్చాడు. ఆర్థిక సంక్ష‌భం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు దోపిడీకి పాల్పడాల‌నుకున్నాడు. అంతేకాని వృత్తిప‌ర‌మైన దొంగ‌కాద‌ని పోలీసులు క‌నుగొన్నారు. అత‌ను నేరం చేయ‌న‌ప్ప‌టికీ, చేసే ప్ర‌య‌త్నం చేశాడ‌ని దొంగ‌త‌నం చేసే ప్ర‌య‌త్నం కింద పోలీసులు అరెస్ట్ చేశార‌ని స‌బ్ ఇన్స్పెక్ట‌ర్ చ‌న్నారావు వెల్ల‌డించారు. 


logo