బుధవారం 25 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 22, 2020 , 00:24:23

స్కంధమాతా నమోస్తుతే..

స్కంధమాతా నమోస్తుతే..

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఐదోరోజైన బుధవారం శ్రీశైల భ్రమరాంబాదేవి స్కంధమాతగా భక్తులను అనుగ్రహించారు. నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతి అమ్మవారు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో, అలంపూర్‌లోని జోగుళాంబ అమ్మవారు స్కంధమాతగా దర్శనమిచ్చారు. కాగా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మిగా, సిద్దిపేట జిల్లా వర్గల్‌ విద్యాధరిలో సరస్వతి మాత విద్యా లలితాదేవిగా, వరంగల్‌లోని భద్రకాళి మాత లలితామహా త్రిపురసుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.