అందంగా మారేందుకు హీరోయిన్స్ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొన్ని సార్లు మిల్కీ బ్యూటీలా మారేందుకు లేని పోని సర్జరీలు చేయించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి. తాజాగా తమిళ బిగ్ బాస్ ఫేం, కోలీవుడ్ నటి రైజాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 017లో ‘వెలయ్యలా పట్టధారి-2’ సినిమాతో తెరంగేట్రం చేసిన రైజా ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ షోకు వెళ్లింది. ఆ షోతో మంచి ఆదరణ దక్కించుకుంది. 2018లో ‘ప్యార్ ప్రేమ కాదల్’తో సత్తాచాటగా, ప్రస్తుతం ‘అలైస్’ ‘హ్యాష్ ట్యాగ్ లవ్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
రైజాను అందంగా మారుస్తానంటూ ఓ మహిళా డాక్టర్ స్కిన్ ట్రీట్మెంట్ చేసిందట. ఈ ప్రయోగం వికటించడంతో కోలీవుడ్ నటి గుర్తు పట్టలేనంతగా మారింది. ఫేస్ మారిపోవడంతోపాటు కన్ను కింద నల్లగా గడ్డలాగా వాచిపోయింది. దీని గురించి డాక్టర్‌తో సంప్రదింపులు చేద్దామని రైజా విల్సన్ ప్రయత్నిస్తుంటే డాక్టర్ అవకాశమే ఇవ్వడం లేదట. దీంతో సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన చెప్పుకుంది ఈ హీరోయిన్. నేను అవసరం లేదన్నా కూడా డాక్టర్ బైరవి ఏదో ట్రై చేసింది. చివరికి ఫలితం ఇలా వచ్చింది. కలిసి నిలదీద్దామంటే ఆమె నగరంలో లేదని అంటున్నారు అని రైజా తన పోస్ట్‌లో పేర్కొంది.