మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 11, 2020 , 09:39:35

షేమ్‌ షేమ్‌.. బాబూ!

షేమ్‌ షేమ్‌.. బాబూ!

అమరావతి : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘బట్టలు విడిచిన మూర్ఖపు రాజు తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించడం లేదనుకున్నాడట’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాల్లో ఓడిపోయిన బాబు, చివరికి కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాడని’ విమర్శించారు. 13 జిల్లాల్ని తాను అభివృద్ధి చేశానని ఏవేవో గ్రాఫిక్స్ ఇప్పుడు చూపిస్తున్నాడట! షేమ్.. షేమ్.. బాబూ!’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అభివృద్ధి పనులు, ఉద్యోగాల కల్పనలో విఫలమైందని ఆరోపించారు. ఏపీలో తెలుగుదేశం హయాంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి, అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 14 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలరా? ప్రశ్నించారు. దీంతో ఆయన ట్విట్టర్‌ వేదికపై టీడీపీ అధినేతపై విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
logo