శుక్రవారం 04 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Sep 25, 2020 , 14:05:46

నెల్లూరులో ఏడడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం

నెల్లూరులో ఏడడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం

నెల్లూరు: అంతర్వేది రథం దగ్ధం ఘటన తరవాత జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు హిందూ దేవాలయాల్లో మరోవైపు చర్చిల్లో దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. వరుస ఘటనలతో ఆంధ్రప్రదేశ్  రాజకీయాలు వేడెక్కాయి.

ఇక తాజాగా నాయుడుపేట నగర పంచాయతీలోని తుమ్మూరు ప్రాంతంలో ఏడడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసారు. విగ్రహం తల, తోక భాగం  పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.  ప  మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా? ఆకతాయిల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.