సోమవారం 08 మార్చి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 21:23:56

ఎస్‌ఈసీ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : సజ్జల

ఎస్‌ఈసీ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : సజ్జల

అమరావతి :  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రాజ్యాంగబద్ధ పదవిని అడ్డుపెట్టుకొని అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. టీడీపీ లబ్ధి చేకూరేలా ఎస్‌ఈసీ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ఇద్దరి డీఎన్‌ఏ ఒక్కటేనని మండిపడ్డారు.

ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నసాకుతో బదిలీ చేసిన అధికారుల సర్వీస్‌ రిజిస్టర్‌లో రిమార్కులు చేర్చాలని డీవోపీటీకి లేఖ రాయడం సరికాదని పేర్కొన్నారు. కొత్త ఓటరు జాబితాలో ఇప్పట్లో ఎన్నికలు కుదరవని ఎస్‌ఈసీ భావించారని, తాను తప్పుకునేందుకు ఉద్యోగులపై తప్పు నెట్టి లేఖ రాశారని రామకృష్ణా రెడ్డి ఆక్షేపించారు. మార్చిలోపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అడ్డగోలు చర్యలను ప్రభుత్వం తిప్పి కొడుతుందని ఆయన పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo