గురువారం 04 మార్చి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 20:40:32

ఏపీ సమాచార కమిషనర్‌కు ఎస్‌ఈసీ మెమో

ఏపీ సమాచార కమిషనర్‌కు ఎస్‌ఈసీ మెమో

అమరావతి : ఏకగ్రీవ ఎన్నికలపై ప్రకటన జారీచేసి ఐఅండ్‌పీఆర్‌ అధికారి నియమావళి ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ ఆక్షేపించింది. నియమావళి ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని సదరు అధికారిని ఆదేశించింది. అనుమతి లేకుండా ప్రకటన జారీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల కమిషనర్‌కు ఎస్‌ఈసీ మెమో జారీ చేసింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఆదేశించింది.

ఇలాంటి చర్యలు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది. ఏకగ్రీవాల ప్రకటనలపై పలుపార్టీలు ఫిర్యాదు చేశాయని, బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని కోరాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రకటన జారీ చేయాలన్నా ప్రభుత్వం, ఏజెన్సీలు అనుమతి తీసుకోవాలని సూచించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo