శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 17:50:05

చంద్రబాబు కోసమే ‘ఎస్‌ఈసీ’ పని చేస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబు కోసమే ‘ఎస్‌ఈసీ’ పని చేస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి : ఆంధ్రప్రదే‌శ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైనా రాజకీయ దుమారం మాత్రం చల్లారడం లేదు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ రమేశ్‌ పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేకున్నా.. పదవీ విరమణలోపు ఎన్నికలు పెట్టాలనే లక్ష్యంతో ఎస్‌ఈసీ ఉన్నారని అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను కొన్నిపార్టీలు హేళన చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌ ఇంకా ఎంతకాలం పదవిలో ఉంటారని, అధికారులపై ఎస్‌ఈసీ తీసుకునే క్రమశిక్షణా చర్యలను తర్వాత రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌ పక్షపాత ధోరణితో ఇబ్బందిపడుతున్న అధికారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కువ నామినేషన్లు వేయమనడం విడ్డూరంగా ఉందని రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు టీడీపీ యత్నిస్తున్నదని ఆక్షేపించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo