మంగళవారం 09 మార్చి 2021
Andhrapradesh-news - Jan 12, 2021 , 17:51:21

నిమ్మగడ్డ గబ్బర్‌ సింగ్‌ అనుకుంటున్నారు..!

నిమ్మగడ్డ గబ్బర్‌ సింగ్‌ అనుకుంటున్నారు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్  గబ్బర్‌ సింగ్‌ అనుకుంటున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.  అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కూడా అలానే చేశారని ఆరోపించారు.  నిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? అని ప్రశ్నించారు. 

ఉద్యోగులను సరెండర్‌ చేస్తే మళ్లీ వేరే వారిని పంపుతామన్నారు.  అందరూ చట్టం ప్రకారం పనిచేయాల్సిందేనని చెప్పారు. ఆయనకు అహంకారం ఎక్కువై నియంతలా వ్యవహరిస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.  

VIDEOS

తాజావార్తలు


logo