గురువారం 02 జూలై 2020
Andhrapradesh-news - May 20, 2020 , 17:47:31

ఒక్కరోజైనా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చారా?

ఒక్కరోజైనా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చారా?

అమరావతి: కరోనా సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు ఏకకాలంలో సీఎం జగన్‌ అమలు చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని చెప్పారు. సజ్జల మీడియా సమావేశంలో మాట్లాడారు. 

'ప్రభుత్వం మంచి చేస్తున్నా విమర్శలు చేయడమే టీడీపీ నేతల పని. టీడీపీ నేతల ఆలోచనలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. కరోనా కట్టడి అనేది సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌ కాదు.. కరోనా నియంత్రణకు ప్రయత్నం చేయాలి. ఎక్కువ కరోనా కేసులు వచ్చాయని భయపడకూడదు..తక్కువ కేసులు వచ్చాయని ఆనంద పడకూడదు. చంద్రబాబు ఆలోచనలు మాత్రం దుర్బుద్ధితోనే ఉన్నాయి..ఒక్కరోజైనా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చారా?' అని అయన విమర్శించారు.  


logo