అప్పీల్‌కు నేడు అవకాశం
రేపు అధికారుల తుది నిర్ణయం
34వ డివిజన్ బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కృతి
జీడబ్ల్యూఎంసీకి బకాయి ఉండడమే కారణం!
22వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కూడా..
వరంగల్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 55 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. 66 డివిజన్లకు 1765 నామినేషన్ సెట్లు దాఖలయ్యాయి. వీటిలో సరిగా లేని 55 సెట్లను తిరస్కరించారు. 1710 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 1703 మంది పోటీలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది. నామినేషన్ల తిరస్కరణపై వచ్చిన అప్పీళ్లను పరిశీలించేందుకు ఏడుగురు అధికారులతో అప్పిలేట్ కమిటీని అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ పమేల సత్పతి నియమించారు. ఆదనపు కమిషనర్ నాగేశ్వర్, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ యాదవ్, చీఫ్ హార్టికల్చర్ అధికారి సునీత, అసిస్టెంట్ సిటీ ప్లానర్ గణపతి, సూపరింటెండెంట్ జాకీర్ హుస్సేన్, రెవెన్యూ అధికారి సుదర్శన్‌ను కమిటీ సభ్యులుగా నియమించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై మంగళవారం అప్పీల్ చేసుకోనే అవకాశం ఉంటుంది. ఏ కారణాలతో నామినేషన్ తిరస్కరించారో దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించే అవకాశం కల్పిస్తారు. నామినేషన్లు తిరస్కరణకు గురైన వారు మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన అప్పీళ్లపై అధికారులు బుధవారం నిర్ణయం తీసుకుంటారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుం ది. ఉపసంహరణ అనంతరం డివిజన్ల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులతో సహా అధికారులు జాబితాను వెల్లడిస్తారు.
బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు..
నిబంధనల ప్రకారం లేని నామినేషన్ల తిరస్కరణ ప్రక్రియలో భాగంగా 32వ డివిజన్లో బీజేపీ తరఫున గంట రవికుమార్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గు రైంది. రవికుమార్ యజమానిగా ఉన్న జీఆర్కే ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గ్రేటర్ వరంగల్ మున్సిప ల్ కార్పొరేషన్‌కు వార్షిక లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు బకా యి ఉంది. ప్రభుత్వ సంస్థకు బకాయిలున్న వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే నిబంధన మేరకు రవికుమార్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. జీఆర్కే ఇన్ ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు గ్రేటర్ వరంగల్‌లో మూ డు చోట్ల పబ్లిసిటీ హోర్డింగ్స్ ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం గ్రేటర్‌కు ఏటా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్లుగా ఈ ఫీజు చెల్లించకపోవడంతో రూ.55 లక్షల వరకు బకాయి ఉంది. ఈ కారణంతో రవికుమార్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. 22వ డివిజన్లో టీఆర్ఎస్ తరఫు న దాఖలు చేసిన విజయకుమార్‌రెడ్డి నామినేషన్‌ను సైతం ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో తిరస్కరించారు. మరో 53మంది నామినేషన్ల విషయంలోనూ అధికారులు ఇదే నిర్ణయం తీసుకున్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల వివరాలను ఆయా అభ్యర్థులకు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వైరల్ ఫోటో : షరతులు లేని ప్రేమకు చిహ్నం!
యోగి సర్కార్‌పై హైకోర్ట్ ఫైర్.. ఐదు నగరాల్లో లాక్‌డౌన్‌కు ఆదేశం