మంగళవారం 11 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 12, 2020 , 15:36:45

కరోనా కట్టడికి ప్రతి జిల్లాకు రూ.కోటి

కరోనా కట్టడికి ప్రతి జిల్లాకు రూ.కోటి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఏపీ మంత్రి ఆవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.ఆదివారం విశాఖలోని ఏయూలో ఉన్న క్వారంటైన్‌ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ ఉదృతి నేపధ్యంలో బాధితులను అన్ని విధాల ఆదుకునేందుకు  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లాకు కోటి రూపాయలను కేటాయించారని అన్నారు.

ప్రతి జిల్లాలోనూ ప్రైవేట్‌ సెంటర్లను గుర్తించి కరోనా వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.కరోనా సోకకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. 


logo