మంగళవారం 11 ఆగస్టు 2020
Andhrapradesh-news - Aug 01, 2020 , 19:49:32

శ్రీశైలంలోకి తగ్గిన వరద నీరు

శ్రీశైలంలోకి తగ్గిన వరద నీరు

శ్రీశైలం : కృష్ణా నదీ ఎగువ పరివాహక ప్రాంతాలో వర్షాలు కురవకపోడంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం స్థిరంగా ఉంది. శనివారం సాయంత్రానికి జూరాల నుంచి 12,640 క్యుసెక్కులు, సుంకేశుల నుంచి 6,560 క్యుసెక్కులు, హంద్రి నుంచి 1,125 క్యుసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల చేశారు. 

జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 852 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 84.4800 టీఎంసీలుగా నమోదైంది. జలాశయానికి 29,675 క్యుసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు అధికారులు వెల్లడించారు. కుడి గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుపడం లేదని, ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జలాశయం నుంచి 38,140 క్యుసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు.


logo