బుధవారం 12 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 02, 2020 , 21:20:04

ఏపీ ముఖ్య సమాచార కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌

ఏపీ ముఖ్య సమాచార కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య సమాచార కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీ రమేశ్‌కుమార్‌ నియమితులయ్యారు. గురువారం రమేశ్‌కుమార్‌ను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లు లేదా 65ఏండ్లు నిండే వరకు (ఏది ముందైతే అది) ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర సమాచార కమిషన్‌ పరిధిలోని స.హ.చట్టం కమిషనర్లలో ఒకరిగా శ్రీనివాసరావును నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  


logo