శనివారం 05 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Oct 29, 2020 , 13:58:26

ఏపీలో 3 కోట్ల విలువైన‌ ఎర్ర‌చంద‌నం ప‌ట్టివేత‌

ఏపీలో 3 కోట్ల విలువైన‌ ఎర్ర‌చంద‌నం ప‌ట్టివేత‌

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఆత్మకూరు అటవీ ప్రాంతంలోని నెల్లూరు పాలెం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఇవాళ‌ తనిఖీలు నిర్వహించారు. ఈసంద‌ర్భంగా ఎర్రచందనం దుంగల‌ను అక్ర‌మంగా తరలిస్తున్న లారీని అట‌వీ అధికారులు ప‌ట్టుకున్నారు. లారీలో ఉన్న 194 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అయితే నిందితులు పరారీలో ఉన్నార‌ని, వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామ‌ని తెలిపారు.