సోమవారం 26 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 02, 2020 , 23:03:01

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు బుధ‌వారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో ముగిశాయి. ఈ కార్య‌క్ర‌మంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.05 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు.


logo