ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 22, 2021 , 18:03:15

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు.   ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు  రమేశ్‌ కుమార్‌ లేఖ రాశారు. ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తొలగించాలని సూచించారు.  సంబంధిత జాయింట్‌ కలెక్టర్లకు  బాధ్యతలు  అప్పగించి విధుల నుంచి రిలీవ్‌ కావాలని చిత్తూరు, గుంటూరు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.   

పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించారు.  గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను, తిరుపతి అర్బన్‌ ఎస్పీని  ఎస్‌ఈసీ  బదిలీ చేసింది.  తిరుపతి అర్బన్‌ ఎస్పీని ఎన్నికల విధుల నుంచి తొలగించింది. చిత్తూరు ఎస్పీకి బాధ్యతలు అప్పగించాలని సూచించింది. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

VIDEOS

logo