శనివారం 26 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 12, 2020 , 20:37:50

కరోనాతో పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

 కరోనాతో పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త , మాజీ టీడీపీ నేత పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా తో చనిపోయారు. గత కొన్నిరోజులుగా ఈ మహమ్మారితో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్ను మూశారు. ఆయన గతంలో కడప లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. శ్రీకాంత్‌రెడ్డి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.  logo