శనివారం 08 ఆగస్టు 2020
Andhrapradesh-news - Aug 02, 2020 , 13:29:30

తూర్పుగోదావరిలో కొనసాగుతున్న ‘ఆదివారం’ కర్ఫ్యూ

తూర్పుగోదావరిలో కొనసాగుతున్న ‘ఆదివారం’ కర్ఫ్యూ

తూర్పు గోదావరి: జిల్లాలో కరోనా రోజురోజుకు పెరిగి పోతుండడంతో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కర్ఫ్యూ కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. వ్యాపార సంస్థలు, మార్కెట్లు, మాంసాహార దుకాణాల కార్యకలాపాలను పూర్తిగా నిషేదించారు. 

మెడికల్‌ షాపులు, ఆస్పత్రులు, అత్యవసర సేవలందించే సంస్థలు యధావిధిగా పనిచేస్తున్నాయి. కరోనా నియంత్రణలో భాగంగా  జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అన్నవరం సత్యదేవుని దర్శనాలను ఆదివారం నిలిపివేశారు. స్వామివారి ఆర్జిల సేవల్లో భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా రుసుం చెల్లించి పరోక్షంగా పాల్గొనవచ్చని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని డిపోల నుంచి బస్సుల సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. సోమవారం  ఉదయం నుంచి యథావిధిగా ఆయా రూట్లలో బస్సులు తిరుగుతున్నాయని ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం వరప్రసాద్‌ తెలిపారు. జిల్లాలోని 9 డిపోల నుంచి మొత్తం 235 సర్వీసులను నడుపుతామని వివరించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo