మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 06, 2020 , 15:34:39

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌

అమరావతి :ఏపీ ‌లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది . అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  నామినేషన్ల దాఖలుకు చివరి తేది ఆగస్ట్‌ 13 కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ప్రకటిస్తారు. వచ్చే ఏడాది మార్చితో ఆ స్థానం గడువు ముగుస్తుండంతో ఒక్క స్థానానికే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 


logo