బుధవారం 21 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 27, 2020 , 22:14:41

చంద్రబాబు కు నోటీసులు...

  చంద్రబాబు కు నోటీసులు...

అమరావతి: విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. వరద ఉదృతి రోజు రోజుకు పెరుగుతుండటంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా నది వరద 5 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో ఈ నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు కూడా నోటీసులు ఇచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. వరద పెరుగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఇండ్లల్లో ఎవరూ ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo