శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Feb 23, 2021 , 15:57:58

ఏపీలో అగ్రవర్ణ పేద మహిళల సంక్షేమానికి సరికొత్త పథకం

ఏపీలో అగ్రవర్ణ పేద మహిళల సంక్షేమానికి సరికొత్త పథకం

అమరావతి : ఈబీసీ (అగ్రవర్ణ పేద) మహిళల సంక్షేమానికి ఈబీసీ నేస్తం పేరుతో సరికొత్త పథకం అమలు చేయనున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 15 వేల చొప్పున రానున్న మూడేండ్లలో రూ. 45 వేలు ఆర్థిక సాయంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. 45-60 ఏండ్లలోపు ఈబీసీ మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార- ప్రజాసంబంధాల శాఖ  మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

రూ. 670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని చెప్పారు. మంగళవారం రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న పలు నిర్ణయాలను సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు బోధనా ఫీజు మొత్తాన్ని చెల్లించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. క్యాలెండర్‌ ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించనున్నామని అన్నారు. రూ.లక్షా 43 వేల మంది లబ్ధిదారులకు రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ. 3500 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo