సోమవారం 06 జూలై 2020
Andhrapradesh-news - Jun 03, 2020 , 12:13:44

ఓడిన తర్వాత కూడా వాళ్లకే వంత పాడుతున్నాడు!

ఓడిన తర్వాత కూడా వాళ్లకే వంత పాడుతున్నాడు!

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష‌నేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ట్విట‌ర్ వేదిక‌గా ప‌లు అంశాల‌పై విజ‌య సాయిరెడ్డి స్పందించారు. 'టీడీపీ కుట్రలు చేసినా, పచ్చమీడియా పిచ్చి పిచ్చిగా రాసుకున్నా, దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు మన ముఖ్యమంత్రి జగన్.  ఈ విషయం TOI సర్వేలో తేలింది. నాయకుడంటే ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాలి. కుట్రలు కుతంత్రాల చంద్ర‌బాబు( CBN)కి అదే స్థానం శాశ్వతమయ్యేలా ఉందని' విమ‌ర్శించారు. 

'ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించిన బాబు, ఓడిన తర్వాత కూడా వాళ్లకే వంత పాడుతున్నాడు. కమీషన్లు తీసుకుని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఫీజులు అడ్డగోలుగా పెంచుకునేందుకు అనుమతించాడు. సీఎం జగన్  ఫీజులు తగ్గిస్తే వ్యవస్థల ద్వారా అడ్డుకుంటున్నాడని' విజ‌య సాయిరెడ్డి ఆరోపించారు. logo