శుక్రవారం 03 జూలై 2020
Andhrapradesh-news - May 26, 2020 , 15:28:03

అలా.. కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ?

అలా.. కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత  చంద్రబాబు  రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టడంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా సెటైర్లు వేశారు. రాష్ట్రంలో బాబు పర్యటనలపై విజయ సాయిరెడ్డి స్పందించారు. 'కరోనా వీరులు కరకట్ట మీద వాలారట! ఇక కృష్ణా నదికి కూడా కోవిడ్ టెస్టులు చేయాలేమో!' అని ఆయన ఎద్దేవా చేశారు. 

'సలహాలు, సూచనలు అంటూ జూమ్‌లో  రోజూ ఊదరగొట్టావు కదా!  ఏడాది పాలనపై సీఎం జగన్  స్వయంగా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరై మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే.. అలా కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ?'  అంటూ చంద్రబాబుని ఉద్దేశించి ట్వీట్ చేశారు.


logo