40ఏండ్ల ఇండస్ట్రీకి కూడా ఇది తెలుసు. కానీ,

అమరావతి: పంచాయతీ ఎన్నికలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయని పేర్కొన్నారు.
'నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు? అధికారంలో ఉన్నప్పుడు ఓటమి భయంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా వాటిని అంధకారంలోకి నెట్టిన చంద్రబాబు...ఇప్పుడు పంచ సూత్రాలతో పల్లెల్లో వెలుగులు నింపుతానంటూ వస్తున్నారు. మాయావి వలలో పడితే మళ్ళీ చీకట్లోకే పయనం!' అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.
'పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయి. పార్టీ గుర్తులు, జెండాలు ఉండవు. 40 ఏళ్ళ ఇండస్ట్రీకి కూడా ఇది తెలుసు. కానీ ఓటమి భయం తీవ్ర అలజడి రేపినట్లుంది. జనరల్ ఎలక్షన్స్ స్థాయిలో మేనిఫెస్టో అంటూ కామెడీ చేస్తున్నారు. ఎన్ని పిల్లి మొగ్గలేసినా ప్రజలు నిన్ను నమ్మరు బాబూ!' అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.