మంగళవారం 20 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Aug 23, 2020 , 13:47:51

'ఇప్పటికైనా ఎన్టీఆర్ మీద సస్పెన్షన్ ఎత్తేస్తారేమో చూడాలి'

'ఇప్పటికైనా ఎన్టీఆర్   మీద సస్పెన్షన్ ఎత్తేస్తారేమో చూడాలి'

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఉద్దేశించి ట్విట్టర్‌ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.  'వెన్నుపోటుకు 23 ఏళ్ళు. 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలుగుదేశం పార్టీ  వ్యవస్థాపకులు  ఎన్టీఆర్ గారిని  చంద్రబాబు & కో వెన్నుపోటు పొడిచి, పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించి, పార్టీ పగ్గాలు లాక్కుని, ఎన్టీఆర్ గారిని అవమానించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ గారి మీద సస్పెన్షన్ ఎత్తేస్తారేమో చూడాలి.' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

'ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్  పాలనపై  ప్రకృతి వరాల జల్లు. వరుసగా రెండో ఏడాది నిండిన నాగార్జున సాగర్, శ్రీశైలం. నిండు కుండల్లా జలాశయాలు - పరవళ్లు తొక్కుతున్న నదీ నదాలు. రాష్ట్రంలో సంతోషాల పంట - చంద్రబాబుకు మాత్రం పెరిగిన కడుపు మంట.' అంటూ మరో ట్వీట్‌ చేశారు. 


logo