మంగళవారం 11 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 07, 2020 , 16:16:44

అంబులెన్స్‌ను స్వయంగా నడిపిన ఎమ్మెల్యే రోజా

అంబులెన్స్‌ను స్వయంగా నడిపిన ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నూతన అత్యాధునిక వసతులు కలిగిన 1088 కొత్త అంబులెన్స్ లను విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి అంబులెన్సులు రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. ఈ వాహనాల్లో 676 వాహనాలు 104 కాగా.. మరో 412 వాహనాలు 108లు. ఇందులో భాగంగా నగరి పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద 108,104 అంబులెన్సు వాహనాలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు.

తర్వాతే ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. సరాదాగా కొద్దిసేపు డ్రైవింగ్ చేసి స్థానికుల్ని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని రోజా అన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


logo