మంగళవారం 07 జూలై 2020
Andhrapradesh-news - Jun 05, 2020 , 15:57:19

బాలకృష్ణ మానసిక పరిస్థితిపై అనుమానాలు: ఏపీ విప్‌ శ్రీనివాస్‌

బాలకృష్ణ మానసిక పరిస్థితిపై అనుమానాలు: ఏపీ విప్‌ శ్రీనివాస్‌

అమరావతి: గడిచిన ఏడాదిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ విప్‌ కే.శ్రీనివాస్‌ ఆరోపించారు. బాలకృష్ణ మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని తాడేపల్లిలోని వైఎస్సార్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన మానసిక పరిస్థితిపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని అన్నారు. ఎన్టీఆర్‌ కుమారుడిగా బాలకృష్ణపై అభిమానం ఉందని పేర్కొన్నారు . ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రవర్తించాలని సూచించారు. చంద్రబాబు మాటలను నమ్మవద్దొని బాలకృష్ణకు సూచించారు. 


logo