ఆదివారం 29 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 24, 2020 , 17:56:27

టీటీడీ కిచెన్‌లో ప్ర‌మాదం.. ఐదుగురికి గాయాలు

టీటీడీ కిచెన్‌లో ప్ర‌మాదం.. ఐదుగురికి గాయాలు

తిరుప‌తి: తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలోని వంటశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. చింతపండు రసం తయారు చేసే విద్యుత్ బాయిలర్ పగిలి అందులోని వేడి నీరు ఐదుగురు పోటు కార్మికులపై పడింది. ఈ ఘ‌ట‌న‌లో ఆ ఐదుగురు కార్మికులు గాయ‌ప‌డ్డారు. అందులో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురు స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. దాంతో వెంట‌నే వారిని  తిరుమలలోని  ఆశ్విని ఆస్ప‌త్రికి తరలించారు. ఈ ప్ర‌మాదంలో  గాయ‌ప‌డిన ఐదుగురిలో ఎవ‌రికీ ప్రాణ‌హాని లేద‌ని వైద్యులు తెలిపారు. కాగా ప్ర‌మాదంలో గాయ‌పడ్డ కార్మికుల‌ను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి  పరామర్శించారు. 

టీటీడీలో ఇలాంటి ప్ర‌మాదం ఇంత‌కు మునుపు ఎప్పుడూ జ‌రుగ‌లేద‌ని పోటు ఇన్‌చార్జ్ వరదరాజులు అన్నారు. వారం రోజుల‌కు ఓసారి అధికారులు మాస్ క్లీనింగ్ నిర్వ‌హిస్తార‌ని, ప్ర‌మాద‌వ‌శాత్తే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలిపారు. ఏదేమైనా ఎవ‌రికీ ఎలాంటి ప్రాణ‌హాని జ‌రుగ‌కుండా ఆ స్వామివారు కాపాడార‌ని  ఆయ‌న పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.