మంగళవారం 09 మార్చి 2021
Andhrapradesh-news - Jan 18, 2021 , 18:12:01

ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?: కొడాలి నాని

ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?: కొడాలి నాని

అమరావతి: టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మంత్రి కొడాలి నాని అన్నారు.  ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు కుట్రలు చేశారని విమర్శించారు.  ఎన్టీఆర్‌ పార్టీని, సీఎం హోదాను చంద్రబాబు  తస్కరించారని మండిపడ్డారు. పదవులు, ఓట్ల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతాడని అన్నారు. 

'ఎన్టీఆర్‌ను ఇష్టపడేవారు చంద్రబాబును రాష్ట్ర సరిహద్దులు దాటించాలి.  ఎన్టీఆర్‌ వర్ధంతి, జయంతి నాడే భారతరత్న ఇవ్వాలని బాబు  కోరుతాడు.  ఎన్టీఆర్‌కు భారతరత్న తెచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. నీచమైన పనుల్లో బాబుకు ప్రపంచరత్న ఇవ్వాలి.  ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?  టీడీపీని సర్వనాశనం చేయగల శక్తి చంద్రబాబు, లోకేశ్‌కే ఉంది.  ఓటుకు కోట్లు కేసులో  హైదరాబాద్‌ నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చాడు.  అఖిల ప్రియ అరెస్ట్‌పై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడు. దేవాలయాలపై  దాడుల ఘటనలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని' మంత్రి నాని హెచ్చరించారు. 

VIDEOS

తాజావార్తలు


logo