గురువారం 28 జనవరి 2021
Andhrapradesh-news - Sep 24, 2020 , 21:59:36

శ్రీశైలంలో బయటపడిన ధ్యానమందిరం

శ్రీశైలంలో బయటపడిన ధ్యానమందిరం

శ్రీశైలం : శ్రీశైల ఆలయ పరివార దేవాలయాలైన పంచమఠాల జీర్ణోద్ధరణ పనుల్లో పురాత ధ్యానమందిరం బయటపడింది. ఘంటామఠం ఆవరణలో ఈ మందిరం కనిపించింది. గురువారం సాయంత్రం ఘంటామఠం ముందు భాగంలోని కొనేరుకు ఉత్తర భాగాన సుమారు 6 అడుగుల 6అంగుళాల విస్తీర్ణంతో ధ్యానమందిరం కనిపించింది. ఈ విషయాన్నిఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. 

ధ్యాన మందిరంలో నైరుతి నుంచి ఆగ్నేయం వరకు, ఆగ్నేయం నుంచి తూర్పు మార్గం వైపునకు సొరంగాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నాటి నిర్మాణాలకు విఘాతం కలుగకుండా జీర్ణోద్ధరణ పనులు చేపడుతున్నారు. రోజురోజుకు బయట పడుతున్న పురాతన కట్టడాలపై పురావస్తుశాఖ అధికారులు కూడా శోధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు  సంబంధిత అధికారులు తెలిపారు. ధ్యానమందిరాన్ని పరిశీలించిన వారిలో ఈఈ మురళీ బాలకృష్ణ, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ శ్రీహరి, సహయ స్థపతి జవహర్, ఏఈ సురేశ్ కుమార్‌రెడ్డి ఉన్నారు. ఈ జీర్ణోద్దరణ పనుల్లోనే ఇటీవలనే వెండి నాణేలు కూడా బయటపడ్డాయి.logo