శనివారం 06 మార్చి 2021
Andhrapradesh-news - Jan 19, 2021 , 08:09:27

గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?

గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?

చిత్తూరు : చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో ఆదివారం రాత్రి గొర్రె, పొట్టేలు కల్యాణం నిర్వహించారు. ఏటా సంక్రాంతి తర్వాత రెండురోజులకు జీవాలకు వివాహం జరిపించడం ఇక్కడి ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల పంటపొలాలకు చీడపీడల నుంచి, గొర్రెలను అంటువ్యాధుల నుంచి గౌరమ్మ కాపాడుతుందని గ్రామస్థుల విశ్వాసం. వరుడి వైపు కిరణ్‌కుమార్, వధువు వైపు దామోదర్‌ కుటుంబసభ్యులు నిలిచి పెళ్లి తంతును వైభవంగా జరిపించాయి. పెద్దసంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.


VIDEOS

logo