ఆదివారం 29 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 22, 2020 , 00:24:23

గజవాహనంపై మలయప్ప

గజవాహనంపై మలయప్ప

తిరుమల/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా  బుధవారం రాత్రి  శ్రీనివాసుడు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. శ్రీదేవీ, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామిని వేద మంత్రోచ్చారణల మధ్య గజవాహనంపైకి వేంచేపు చేయించి సేవను నిర్వహించారు. ఉదయం  9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీవారు ధనుర్ధారి అయిన కోదండరాముడి అలంకారంలో హనుమంతవాహనంపై దర్శనం ఇచ్చారు. కార్యక్రమాల్లో పెద్ద జీయర్‌స్వామి, చిన జీయర్‌స్వామి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.