ఆదివారం 24 జనవరి 2021
Andhrapradesh-news - Nov 21, 2020 , 19:20:55

న‌డికుడి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో భారీ చోరి

న‌డికుడి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో భారీ చోరి

గుంటూరు: గుంటూరు జిల్లా నడికుడి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో భారీ చోరి జ‌రిగింది. దుండగులు రూ.85 లక్షల సొమ్ము కాజేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు. ప్రాథమిక సమాచారంతోపాటు చోరీ జరిగిన తీరును పరిశీలిస్తే ఆరితేరినవారే ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. 

కాగా, లాకర్‌ను పగులగొట్టి దొంగలు సొమ్ము ఎత్తుకెళ్లినట్లు ఎస్పీ వెల్ల‌డించారు. నిందితులు అన్నిరకాలుగా రెక్కీ చేసి పక్కా ప్రణాళికతో చోరీకి పాల్ప‌డిన‌ట్లు వివరించారు. లోపలి నుంచి సీసీ కెమెరాల కనెక్షన్‌ను కూడా తొలగించార‌ని, పోలీసు జాగిలాలు వస్తాయనే అనుమానంతో దొంగలు కారం చల్లార‌ని ఎస్పీ విశాల్‌ తెలిపారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo