బుధవారం 12 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 02, 2020 , 20:33:47

ఏపీ ఉద్యోగుల జీతాలకు లైన్‌ క్లీయర్‌..

ఏపీ ఉద్యోగుల జీతాలకు లైన్‌ క్లీయర్‌..

హైదరాబాద్‌ : ఏపీలో ప్రభుత్వోద్యోగుల జీతాలకు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. గురువారం అప్రోప్రియేషన్‌ బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఆమోదం తెలిపారు. 2020-21 బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టి 14రోజులు ముగియడంతో ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం లభించింది. దీంతో ఉద్యోగుల జీతభత్యాలకు, ఇతర ఆర్థిక బిల్లుల చెల్లింపునకు, ప్రభుత్వ ఖర్చులకూ సాంకేతికంగా అడ్డంకులు తొలగినట్లయ్యింది. 


logo